ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.  హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్ లో బుధవారం నల్గొండ జిల్లా టీఎన్జీవో యూనియన్ 2026 సంవత్సరం నూతన డైరీ, క్యాలెండర్‌‌‌‌ను మంత్రి కోమటిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఉద్యోగుల సమస్యలు ఈహెచ్ఎస్, పెండింగ్ బిల్లులు, డీఏ విడుదల పరిష్కారం కోసం సీఎంతో మాట్లాడి పరిష్కరిస్తానని తెలిపారు.  

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల వేతనాలు చెల్లిస్తున్నామన్నారు. టీఎన్జీవో యూనియన్ బిల్డింగ్ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రోగ్రాంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి, కార్యదర్శి జే.శేఖర్ రెడ్డి, ఎన్డీసీఎంఎస్  మాజీ చైర్మన్ బోళ్ల వెంకట రెడ్డి, టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ ఉపాధ్యక్షుడు సిహెచ్. నర్సింహ చారి, విజయ్, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు ఏడుదొడ్ల  వెంకట్రామిరెడ్డి, కోశాధికారి జయరాజు, అసోసియేట్ అధ్యక్షుడు డీఐ రాజు, దశరథ, ఉద్యోగులు పాల్గొన్నారు.