
ఢిల్లీ: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. డిసెంబర్ 11వ తేదీ సోమవారం పార్లమెంట్ కు వెళ్లి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. స్పీకర్ కు తన రాజీనామా లేఖ సమర్పించారు. 2019లో వెంకట్ రెడ్డి నల్గొండ జిల్లా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.
ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్.. 64 స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆయన మున్సిపల్, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన ఈరోజు ఢిల్లీ వెళ్లి తన ఎంపి పదవికి రాజీనామా చేశారు.