రాష్ట్రాన్ని ఎకో టూరిజం హబ్‌‌‌‌గా తీర్చిదిద్దుతం : మంత్రి కొండా సురేఖ‌‌‌‌

రాష్ట్రాన్ని ఎకో టూరిజం హబ్‌‌‌‌గా తీర్చిదిద్దుతం  : మంత్రి కొండా సురేఖ‌‌‌‌
  • నీలాద్రి అభివృద్ధిపై స్పెషల్​ ఫోకస్ : మంత్రి కొండా సురేఖ‌‌‌‌

హైదరాబాద్, వెలుగు:తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ పర్యాటక రంగంలో ప్రత్యేక ఎకో-టూరిజం హబ్‌‌‌‌గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రి అధ్యక్షతన సెక్రటేరియెట్ లో ఎకోటూరిజం ప్రాజెక్టు స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. టూరిజం పాలసీలో భాగంగా ఎకో టూరిజం అభివృద్ధి విధానాలు,
అమలు ప్రణాళికలపై  ఆరా తీశారు. సమావేశంలో అనంతగిరి (వికారాబాద్), కనకగిరి (ఖమ్మం), నందిపేట్ (నిజామాబాద్), మన్ననూర్ జంగల్ రిసార్ట్ (నాగర్ కర్నూల్), ముచ్చెర్ల ఎకో పార్కు (నల్గొండ), వైజాగ్ కాలనీ (నల్గొండ), మంజీరా (సంగారెడ్డి), అమరగిరి (నాగర్ కర్నూల్) తదితర ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టుల అమలుపై చర్చించారు. 

ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ..గుర్తించిన సైట్లలో అభివృద్ధి పనులు వేగంగా చేపట్టాలని, స్థానిక గిరిజనులు, ప్రాంతవాసుల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ప్రాజెక్టులను అమలు చేయాలని కమిటీకి సూచించారు. ఆయా ప్రాంతాల్లో ఆలయాలు ఉంటే వాటిని ఆధ్యాత్మిక పద్ధతులు అనుసరించి అభివృద్ధి చేయాలన్నారు. మధ్యప్రదేశ్‌‌‌‌లోని భీమ్‌‌‌‌బెట్కా కొండల తరహాలో నీలాద్రి కొండలపై ప్రాచీన కాలం నాటి ఆనవాళ్లు ఉన్నాయని, వాటిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ఎకో టూరిజం హబ్‌‌‌‌గా మార్చాలని చెప్పారు.

వికారాబాద్‌‌‌‌లోని అనంతగిరి హిల్స్ మొదటి దశ పనులు పూర్తయ్యాయని, రెండో దశలో కారవాన్ క్యాంపింగ్, ఎకో కాటేజీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఖమ్మంలోని కనకగిరి ప్రాజెక్టు పనులు అక్టోబర్ నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. నల్గొండలోని ముచ్చెర్ల ఎకో పార్క్‌‌‌‌లో నైట్ సఫారీ, వీఆర్ పార్క్, డైనోసార్ పార్క్ వంటివి రూపకల్పన చేసినట్లు మంత్రి చెప్పారు. సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్ పొదెం వీరయ్య, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్(హెచ్ఓఎఫ్ఎఫ్) డాక్టర్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

డెత్ గ్రాట్యుటీ, ఎక్స్​గ్రేషియా అందజేత

  • దేవాదాయ శాఖ ఉద్యోగుల కుటుంబాలకు మంజూరు
  • రూ.1.05 కోట్లు అందజేసిన మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, వెలుగు: విధి నిర్వహణలో చనిపోయిన దేవాదాయ శాఖ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు డెత్ గ్రాట్యూటీ, ఎక్స్​గ్రేషియాను ప్రభుత్వం మంజూరు చేసింది. సెక్రటేరియెట్​లో మంత్రి కొండా సురేఖ శుక్రవారం తన చాంబర్​లో బాధిత కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారు. ఈ మేరకు డెత్ గ్రాట్యూటీ, ఎక్స్​గ్రేషియాను అందజేశారు. 20 మంది బాధిత కుటుంబాల‌‌‌‌కు రూ.కోటి ఐదు ల‌‌‌‌క్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. గ్రాట్యూటీ, ఎక్స్​గ్రేషియో అందజేసే ప్రక్రియ‌‌‌‌ను వేగ‌‌‌‌వంతం చేసి త్వరితగతిన వ‌‌‌‌చ్చేలా కృషిచేసిన మంత్రికి బాధిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిప‌‌‌‌ల్ సెక్రట‌‌‌‌రీ శైల‌‌‌‌జా రామ‌‌‌‌య్యర్‌‌‌‌, అడిష‌‌‌‌న‌‌‌‌ల్ క‌‌‌‌మిష‌‌‌‌న‌‌‌‌ర్ కృష్ణవేణి, వెంక‌‌‌‌టేశ్, రామ‌‌‌‌కృష్ణరావు పాల్గొన్నారు.