- హాస్పిటల్ హెచ్ డీఎస్ మీటింగ్లో మంత్రి కొండా సురేఖ
వరంగల్ సిటీ, వెలుగు: రీజనల్ ఐ హాస్పిటల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని మంత్రి సురేఖ తెలిపారు. బుధవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఐ హాస్పిటల్‌లో సిబ్బంది కొరత తీర్చడంతో పాటు అవసరమైన వైద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఏజెన్సీ ద్వారా నియమితులైన వర్కర్స్ ను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదన్నారు.
సీకేంఎం హాస్పిటల్లో నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని మంత్రి ఆదేశించారు. బాలింతలను 108లో ఆసుపత్రి నుంచి ఇంటికి చేర్చాలని సూచించారు. అనంతరం రూ.75 లక్షలతో చేపట్టే అంతర్గత రోడ్ల పనులను ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి ప్రారంభించారు. అడిషనల్ కలెక్టర్ గణేశ్, జడ్పీ సీఈవో రాంరెడ్డి, డీబీసీడీవో పుష్పలత, డీఎస్డీవో భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
