ఖిలా వరంగల్ కోటలో టూరిజం అభివృద్ధి చేస్తాం : మంత్రి కొండా సురేఖ

ఖిలా వరంగల్ కోటలో టూరిజం అభివృద్ధి చేస్తాం : మంత్రి కొండా సురేఖ

ఖిలా వరంగల్ (మామునూరు), వెలుగు: ఖిలా వరంగల్ కోటను పర్యాటకులు ఆకర్శించేలా టూరిజం అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మోటు పునరుజ్జీవనంలో భాగంగా పార్క్, రాతి కోట చుట్టూ రూ.2 కోట్ల అంచనాతో నిర్మించనున్న ప్రహరీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖిలా వరంగల్ చరిత్రను కాపాడుతూనే కోట విశిష్టను పెంపొదించేలా, టూరిజం అభివృద్ధి చేసి పర్యాటకులకు కనువిందు చేసేలా చేస్తామన్నారు.

 మ్యూజియంను త్వరలో ప్రారంభిస్తామని, కోటలో టూరిజం, అటవీ డిపార్ట్మెంట్లతో హరిత హోటల్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో  నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరాంరెడ్డి, నగర కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, కుడా అధికారులు అజిత్ రెడ్డి, ఏఈ భరత్, కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్, మీసాల ప్రకాశ్, కొత్తపెల్లి శ్రీనివాస్, మడిపల్లి కృష్ణ, బోయిని దూడయ్య, 37, 38 డివిజన్స్ కార్పొరేటర్స్ బోగి సువర్ణ సురేశ్, భైరబోయిన ఉమా దామోదర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.