ఎన్జీటీ నోటీసులు కొట్టేయమంటూ హైకోర్టుకు మంత్రి కేటీఆర్

ఎన్జీటీ నోటీసులు కొట్టేయమంటూ హైకోర్టుకు మంత్రి కేటీఆర్

ఎన్జీటీ నోటీసులు కొట్టేయండి

హైకోర్టుకు మంత్రి కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంకర్‌‌పల్లి మండలం జాన్వాడ/మీర్జాగూడలో రూల్స్ కు వ్యతిరేకంగా ఫాం హౌస్ నిర్మించారని నేషనల్‌‌ గ్రీన్‌‌ ట్రైబ్యునల్‌‌ (ఎన్‌‌జిటి) చెన్నై బెంచ్‌‌ ఇచ్చిన నోటీసులును మంత్రి కేటీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు. కేటీఆర్ వేసిన రిట్ పిటిషన్ పై జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిల డివిజన్ బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌‌ను వీడియో కాన్ఫరెన్స్‌‌ ద్వారా విచారణ చేయాలని ఢిల్లీకి చెందిన లాయర్ రాజ్‌‌ పంజ్వానీ బెంచ్ ను కోరారు. ఫిజికల్ కోర్టు విచారణ చేసే కేసుల జాబితాలో ఈ రిట్‌‌ ఉందని, వీడియో కాన్ఫరెన్స్‌‌లో విచారణ చేసే అంశంపై ఫుల్‌‌ కోర్టు నిర్ణయించాల్సి ఉంటుందని బెంచ్ స్పష్టం చేసింది. నవంబర్‌‌ నుంచి అన్ని కేసుల్ని ఫిజికల్ కోర్టులో విచారణ చేయాలనే యోచనలో ఉన్నామని చెప్పింది. అది సాధ్యం కాని పక్షంలో వీడియో కాన్ఫరెన్స్‌‌ ద్వారా విచారణకు అవకాశం కల్పిస్తామంది. రేవంత్‌‌రెడ్డి తరఫున ఎస్‌‌ఎస్‌‌ ప్రసాద్, కేటీఆర్‌‌ తరఫున తరుణ్‌‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. తదుపరి విచారణను నవంబర్ 16కు హైకోర్టు వాయిదా వేసింది.

For More News..

ఎల్​ఆర్​ఎస్​పై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం

కొడుకు పానం బాగయితలేదని తండ్రి ఆత్మహత్య

బిడ్డ పుట్టిందని డివోర్స్ అడిగిన జవాన్