
కరోన సమయంలో ముందు ఉండి పని చేసిన ఫ్రంట్ లైన్ వారియర్స్ శానిటేషన్,డాక్టర్లు,పోలీసులను జీవితాంతం రుణపడి ఉంటామన్నారు మంత్రి కేటీఆర్. కరోనా సమయంలో కూడా కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆగలేదన్నారు. ప్రతి నెల టన్ ఛన్ గా మున్సిపాలిటీలకు నిధులు ఇస్తున్నామన్నారు. గత ఏడాది వర్షాల కరణంగా ఇక్కడ కాలనీలు, బస్తీలు అనేక ఇబ్బంది పడ్డాయన్నారు. మళ్ళీ వచ్చే ఏడాదిలో అలాంటి పరిస్థితి లేకుండా బాక్స్ డ్రైన్స్ కడుతున్నామన్నారు. రాష్ట్రంలో నిరంతరంగా నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామన్నారు. భారత్ దేశంలో అనేక నగరాల్లో మంచి నీళ్ల సమస్య ఉంది,కానీ మన రాష్ట్రం లో అలాంటి పరిస్థితి లేదన్నారు కేటీఆర్. ఓ.ఆర్.ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు,కార్పొరేషన్స్ లో మంచి నీళ్ళు కొన్ని చోట ఇస్తున్నామన్నారు. నీళ్లు రాని చోట మరి కొన్ని రోజుల్లో అక్కడికి కూడా నీళ్లు ఇవ్వబోతున్నామన్నారు.
ముఖ్యమంత్రి మనవడు ఎలాంటి భోజనం తింటాడో,అలాంటి భోజనము గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులకు ఇస్తున్నామన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు కేవలం మూడు ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే ఉండే, కానీ కె.సి.ఆర్ ప్రభుత్వం వచ్చాక అనేక ముల్టి స్పెషలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నామన్నారు. అద్భుతం గా హిందువులకు,ముస్లింలకు,క్రైస్తవులు ఒకే చోట అంతిమ సంస్కారాలు చేసే విధంగా వైకుంఠధామం ఏర్పాటు చేశామన్నారు. గతంలో జి.ఓ 58 కింద్ లక్ష పట్టాలు ఇచ్చామన్నారు. రాబోయే రోజుల్లో పేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వారికి జి.ఓ 58 తీసుకొచ్చి రేగులరైజ్ చేస్తామన్నారు. పేదల పక్షపాతి టి.ఆర్.ఎస్ ప్రభుత్వమన్నారు. కేంద్రం తెలంగాణ కు నిధులు ఇవ్వడం లేదన్నారు. నరేంద్ర మోడీ.. తెలంగాణకు ప్రధాని కాదా,కేవలం గుజరాత్ కు మాత్రమే ప్రధానిలా వ్యవహరించడం సరికాదన్నారు కేటీఆర్. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపిస్తుందన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలకు విద్య సంస్థలు ఇచ్చారు,కానీ మన రాష్ట్రం కు ఇచ్చింది ఏమి లేదన్నారు. బండి సంజయ్ ..మిలియన్ మార్చ్ ను ఎందుకు పిలుపునిస్తున్నారు..కేంద్ర ప్రభుత్వం ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. 15 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం లో ఖాళీ ఉన్నాయి, ముందు వాటిని నింపాలన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తున్నాం,రాబోయే రోజుల్లో ఇస్తామన్నారు కేటీఆర్.