కిషన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ కౌంటర్

కిషన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ కౌంటర్

మెడికల్ కాలేజీల కేటాయింపుల విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రమంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘‘కిషన్ రెడ్డి గారూ..నేను మిమ్మల్ని సోదరునిగా గౌరవిస్తాను. కానీ మెడికల్ కాలేజీల కేటాయింపు గురించి మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో మీరు చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. తెలంగాణకు కేంద్రం 9మెడికల్ కాలేజీలు మంజూరు చేసిందని మీరు ప్రకటించారు..కానీ అది అబద్దం’’ అని అన్నారు. 

‘‘హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు మీరు ప్రకటించారు. అయితే ఎప్పటిలాగే గుజరాతీ బాసులు దానిని వారి రాష్ట్రానికి మార్చారు. ఈ విషయంలో మీరు హైదరాబాద్ ప్రజలను తప్పుదోవ పట్టించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కేంద్రం ఎందుకు తుంగలోతొక్కుతున్నదో ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి.  తెలంగాణ, ఏపీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకపోవడం సిగ్గుచేటు’’ అని విమర్శించారు.