దేశం దృష్టిని మరల్చేందుకే అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించారా?

దేశం దృష్టిని మరల్చేందుకే అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించారా?

అగ్నిపథ్ స్కీం వల్ల  యువత  డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు,  బార్లర్లు,  వాషర్ మెన్ లుగా  ఉపాధి  పొందవచ్చని కేంద్రమంత్రి  అన్నారని  విమర్శించారు  మంత్రి కేటీఆర్. అగ్నివీరులను  సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తానని  మరో బీజేపీ  నాయకుడు చెప్పారన్నారు . ఇలా  చెప్పిన  బీజేపీ నేతలను కాకుండా... మీరు చెప్పింది  అర్థం చేసుకోలేదని  యువతను  నిందిస్తున్నారా.. మోడీజీ  అని కేటీఆర్ ట్వీట్ చేశారు.  అగ్నిపథ్ స్కీం పై  బీజేపీ నేతలు పొంతన లేకుండా  చేసిన వ్యాఖ్యలపై  రాసిన  టైమ్స్ నౌ  సోర్టీని ట్వీట్ కు  ట్యాగ్ చేశారు మంత్రి కేటీఆర్. ఇక మరో ట్వీట్ లో శ్రీలంకలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అవినీతి బంధంపై వస్తున్న ఆరోపణలపై దేశం దృష్టిని మరల్చేందుకే అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించారా? అని కేటీఆర్ ప్రశ్ని్ంచారు.