కేసీఆర్ కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు సాగడం వలనే ఉన్నత స్థాయికి చేరారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మే 5వ తేదీ శుక్రవారం ఆయన గ్రేటర్ వరంగల్ పరిధిలో పర్యటించారు. ఇందులో భాగంగా కిట్స్ కాలేజీలో ఇక్యుబేషన్ సెంటర్ ను ప్రారంభించి, ఎగ్జిబిట్లను పరిశీలించారాయన. సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులు చూపిన ప్రతిభను అభినందించారు. అనంతరం కేటీఆర్ విద్యార్థులతో ముచ్చటించారు. కిట్స్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్ వేరి బ్యూటిఫుల్ అన్నారాయన.
"నాలుగేళ్ల క్రితం ప్రధానమంత్రి మోడీ మీటింగ్ పెట్టి నన్ను పిలిచారు. భారతదేశం అభివృద్ధి చెంది అగ్రరాజ్యాల సరసన నిలవాలంటే మనం ఏమి చేయాలని ప్రధాని అడిగారు. ఈమేరకు మూడు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాను. ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా నిలవాలంటే త్రీఐస్ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఫస్ట్ ఐ ట్రాన్స్ఫరెన్సీ ఇన్నోవేషన్..సెకండ్ ఐ ట్రాన్స్ఫరెన్సీ ఇన్ఫ్రాస్ట్రక్షన్.. థర్డ్ ఐ ఇంక్లోసింగ్ గ్రోత్.. ఈ మూడు అంశాలను ఆ రోజు మోడీ దృష్టికి తీసుకెళ్లాను. ఈ రోజు కిట్స్ ఇంక్యుబెషన్ అందులో భాగమే" అన్నారు మంత్రి కేటీఆర్.
"1997–98 లో నేను ఫస్ట్ టైం అమెరికా వెళ్లాను. అక్కడ ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ప్రాధాన్యత ఇచ్చారు. అమెరికాలో గుడ్ హైవేస్ ఉన్నాయి.. రిచ్ కంట్రీ. మడి కట్టుకొని ఉంటే అభివృద్ధి చెందలేము. ఆ రోజుల్లో రిటైర్డ్ అయ్యే నాటికి సొంత ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజుల్లో ఉద్యోగం పొందిన తర్వాత ఫస్ట్ కారు, ఇల్లు కొంటున్నారు. ఆ రోజులకు.. ఈ రోజులకు చాలా తేడాలు వచ్చాయి. స్కిల్ డెవలప్మెంట్ అయితే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. విప్లవాత్మక మార్పు తీసుకురావడమే ఇన్నోవేషన్.. ఇన్నోవేషన్ పిల్లలకో, టెక్నాలజీకో స్టాట్ అప్ కు పరిమితమైంది కాదు. మార్పు గవర్ననెన్స్ లో రావాలి... మన లైఫ్ లో రావాలి. ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ లో ప్రభుత్వం పాత్ర ఎంతా ఉంటుందో... ప్రైవేట్ వ్యక్తులుగా మీ పాత్ర అంతే ఉంటుంది" అని కేటీఆర్ తెలిపారు.
ఈ జనరేషన్ పిల్లలు బోల్డుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేవుడిచ్చిన బుర్రను(మైండ్) ఇతర దేశాల వాళ్ళు ఉపయోగించుకున్నారు..మనం ఉపయోగించలేకపోతున్నాం. ప్రపంచస్థాయి ఉత్పత్తులపై మనం దృష్టి పెట్టలేదు. చైనా లాంటి దేశాలు నా పోటీ అమెరికా, జపాన్ అని ఉన్నారు. మనమేమో నా పోటీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక అని ఇక్కడ చస్తున్నాం. ప్రపంచ స్థాయి ఉత్పత్తులపై ఇతర దేశాల వాళ్ళు పోటీపడుతున్నారు. మనమేమో కులం ఏంటి? మతం ఏంటి?... అసలు పని మీద ధ్యాస లేదు.. ఇది మన అవలక్షణం. మంచినీళ్లు ఇవ్వాలని, కరెంటు ఇవ్వాలని, మంచి పనులు చేయాలని సోయి లేదు. ఇవన్నీ పోవాలంటే ఫోకస్ మారాలి...సములా మార్పులు రావాలి. ఉద్యోగాలు చేయడం కాదు... నేను సైతం అంటూ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు రావాలి. మనం చేసే పనులలో ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి.. వాటిని అధిగమించినప్పుడే మంచి ఫలితాలు సాధిస్తాం. కేసీఆర్ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ముందుకు సాగడం వలనే ఉన్నత స్థాయికి చేరారు" అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.