మంత్రి కేటీఆర్‌కు హార్వర్డ్‌ యూనివర్సిటీ ఆహ్వానం

 మంత్రి కేటీఆర్‌కు హార్వర్డ్‌ యూనివర్సిటీ ఆహ్వానం

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు అరుదైన ఆహ్వానం అందింది.   2024 ఫిబ్రవరిలో జరగనున్న ఇండియా కాన్ఫరెన్స్‌లో ప్రసంగించాలని  హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. 

‘ఇండియా రైసింగ్‌- బిజినెస్‌, ఎకానమీ, కల్చర్‌’ థీమ్‌తో  ఈ  సదస్సు నిర్వహించనున్నారు. హార్వర్డ్‌ యూనివర్సిటీ ఆహ్వానంపై  మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.  తెలంగాణ అభివృద్ధి విధానాలను వివరించేందుకు మంచి అవకాశమని తెలిపారు. 

ప్రపంచవ్యాప్తంగా వెయ్యిమందికి పైగా వ్యాపరవేత్తలు  ఇతర ప్రముఖులు ఈ సదస్సుకు హాజరుకానునన్నారు.  కాగా  హార్వర్డ్ ఆహ్వానం కేటీఆర్ కి ఇదే మొదటిది కాదు. గతంలో కూడా ఆయనకు ఈ ప్రఖ్యాత యూనివర్శిటీ నుంచి కాన్ఫరెన్స్ లలో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందాయి.  

ALSO READ : ఆయన వల్లే ఆంధకారం..నోరు అదుపులో పెట్టుకో.. పోదెం వర్సెస్ రేగా..