కోమటిరెడ్డి బ్రదర్స్​కు బాగా బలుపు : చిట్యాల రోడ్​షోలో మంత్రి కేటీఆర్

కోమటిరెడ్డి బ్రదర్స్​కు బాగా బలుపు : చిట్యాల రోడ్​షోలో మంత్రి కేటీఆర్
  • కోమటిరెడ్డి బ్రదర్స్​కు బాగా బలుపు 
  • వారిచ్చే పైసలు తీసుకొని కారుకే ఓటేయండి
  • చిట్యాల రోడ్​షోలో మంత్రి కేటీఆర్

నల్లగొండ : కాంగ్రెస్ ​లీడర్లు కోమటిరెడ్డి బ్రదర్స్​కు బలుపు బాగున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన మాట్లాడారు. 'కోమటి రెడ్డి బ్రదర్స్ ఎమ్మెల్యేలుగా గెలిచేది లేదు కానీ సీఎం అవుతారంట. నల్లగొండ, మునుగోడులో మళ్లీ బీఆర్ఎస్ గెలుస్తుంది. వీళ్లకి బలుపు బాగున్నది. నకిరేకల్ ప్రజలు ఎట్ల చెప్తే అట్ల వింటారనుకుంటున్నారు. వాళ్ల దగ్గర చాలా పైసలున్నాయ్. వారిచ్చే పైసలు తీసుకోండి. కానీ, కారు గుర్తుకే ఓటేయండి’ అని అన్నారు.