హైదరాబాద్ లో మొబైల్‌ ఐసీయూ బస్సులు

V6 Velugu Posted on Jun 03, 2021

దేవుడితో సమానంగా హెల్త్‌కేర్‌ వర్కర్లను చూస్తున్నారని తెలిపారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఇవాళ(గురువారం) మొబైల్‌ ICU బస్సులను  ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్‌ మొబైల్‌ బస్సులను అందించిన లార్డ్స్‌ చర్చికి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా లాంటి పరిస్థితుల్లో మెడికల్‌ యూనిట్‌ బస్సుల ప్రారంభం సంతోషంగా ఉందన్నారు. మొదటి విడతగా రాష్ట్రంలో 30 బస్సులను ప్రారంభించినట్లు చెప్పారు. బస్సులను ప్రారంభించిన తర్వాత బస్సులో ఉన్న వైద్య సదుపాయాలను కేటీఆర్‌ పరిశీలించారు.

మెడికల్‌ యూనిట్‌ బస్సులో వైద్య సేవల కోసం ఒక డాక్టర్‌, ఇద్దరు నర్సులతో పాటు 10 బెడ్లు అందుబాటులో ఉంటాయి. 

Tagged Minister KTR, Hyderabad, launches mobile ICU buses

Latest Videos

Subscribe Now

More News