హైదరాబాద్ లో SNDP పనులకు శంకుస్థాపన

హైదరాబాద్ లో SNDP పనులకు శంకుస్థాపన

త్వరలోనే నగరంలో నాలాల సమస్యకు చెక్ పడుతుందన్నారు మంత్రి కేటీఆర్. నాలా పరిసరాల్లో నివసిస్తున్న వారి కష్టాలు త్వరలో తీరిపోనున్నాయన్నారు. హైదరాబాద్ నగరంలో నాలలకు శాశ్వత పరిష్కారం కోసం SNDP ( స్ట్రాటజిక్ నాల డెవలప్మెంట్ ప్రోగ్రాం ) కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా నల్లకుంటలో ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్. రాబోయే రోజుల్లో వర్షం అధికంగా కురుసినా..నాల పరిసరాల్లో నివసించే ప్రజలకు ఇబ్బంది కాకుండా ఈ స్ట్రేటజిక్ నాల డెవలప్మెంట్ ప్రోగ్రాం ను టెక్ అప్ చేసామన్నారు. రూ. 858 కోట్ల రూపాయలతో నాలల డేవేలప్ మెంట్ చేయబోతున్నామన్నారు. గత ఏడాది హైదరాబాద్ లో కుంభవృష్టి వర్షం కురిసింది..అపుడు అశోక్ నగర్,గోల్నాక పరిసరాలు నీటి మునిగాయన్నారు మంత్రి కేటీఆర్. వచ్చే వర్ష కాలం నాటికి ఈ నాల పరిసరాల్లో జరుగుతున్న పనులు పూర్తి చేస్తామన్నారు. ఆ దిశగా అధికారులు పనులు చేయాలని మంత్రి ఆదేశించారు.

జిహెచ్ఎంసి పరిధిలో 633 కోట్లు.. బల్దియా పరిసర మున్సిపాలిటీలు,కార్పొరేషన్ పరిధి లో నాల డెవెలప్ మెంట్ కోసం 225.32 కోట్లు ఖర్చు చేయబోతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మీర్పేట్ పరిధిలో 45.62 కోట్లు,  బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 23.94 కోట్లు, జల్పల్లి పరిధిలో24.85 కోట్లు, పెద్ద అంబర్పేట్ పరిధిలో 32.42 కోట్లు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 84 కోట్లు.. అభివృద్ధి పనులు జరుగుతాయిని తెలిపారు. నాలాల సమస్య పరిష్కారంపై స్థానికులతో కూడా మాట్లాడామన్నారు. రోడ్ల అభివృద్ధి కోసం ఎలా కార్యక్రమం చేపట్టామో.. నాలాల సమస్యకు కూడా వ్యూహాత్మక ప్రణాళిక వేశామన్నారు. 

ఇవి కూడా చదవండి:

31 రాత్రి పబ్ లు, బార్లపై నజర్

న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు