కేంద్రమంత్రితో కేటీఆర్ భేటీ..వాటికి సహకరించాలని వినతి

కేంద్రమంత్రితో కేటీఆర్ భేటీ..వాటికి సహకరించాలని వినతి

మంత్రి కేటీఆర్ కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్ మురుగునీటి పారుదల ప్లాన్ కు ఆర్థికసాయం చేయాలని కేంద్రమంత్రిని కోరారు. ఎస్టీపీల నిర్మాణానికి రూ.8,654.54 కోట్లు ఖర్చు అవుతుందని వెల్లడించారు. ప్రాజెక్టు వ్యయంలో మూడో వంతు రూ.2,850 కోట్లు అమృత్ -2 కింద ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే 100శాతం మురుగునీటిని శుద్ధీ చేయడమే కాకుండా మూసీనది సహా ఇతరవాటికి మురుగు కాలుష్యాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని కేటీఆర్ తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్ లో వ్యక్తిగత రాపిడ్ ట్రాన్సిట్ కారిడార్ కు సహకరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మెట్రో రైల్, ఎంఎంటీఎస్ కి ఫీడర్ సేవలుగా వ్యవహరించడానికి పీఆర్టీ, రోప్ వే సిస్టమ్స్ వంటి స్మార్ట్ అర్బన్ మొబిలిటీ సొల్యూషన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంపికలను అన్వేషిస్తోందని తెలిపారు.