మమ్మల్ని తొక్కేస్తున్నారంటూ కేటీఆర్ సరదా కామెంట్స్

మమ్మల్ని తొక్కేస్తున్నారంటూ కేటీఆర్ సరదా కామెంట్స్

మహిళలు వ్యాపార రంగంలో రాణించాలని మంత్రి కేటీఆర్(Minister Ktr) ఆకాంక్షించారు. ప్రతి త‌ల్లిదండ్రులు అమ్మాయిల‌కు ఇష్టమైన చ‌దువును చ‌దివించాలని.. వాళ్లు ఫెయిల్యూర్ అయినా కూడా వెన్నుత‌ట్టి ప్రోత్సహించాలని చెప్పారు. అప్పుడే అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించ‌గ‌లుగుతారని ఆయన తెలిపారు. వీ హ‌బ్( WE HUB ) 5వ వార్షికోత్సవ వేడుక‌ల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్త్రీ, పురుషుల‌కు స‌మానంగానే ప్రతిభ ఉంటుందని తెలిపారు. తెలిసి తెలియక ఇంటి నుంచే అమ్మాయిని తక్కువ చేసి.. అబ్బాయి ఎక్కువ అన్న భావన నేర్పిస్తామని..పిల్లల్ని ఎలా పెంచుతామనేది ఎంతో ముఖ్యమని అన్నారు.  

" అమ్మనాన్న నన్ను, నా చెల్లిని బాగా చదివించారు.నా చెల్లి యూఎస్ వెళ్తా అంటే నా కంటే ముందే పంపించారు. అలాగే మా పిల్లలకు కూడా సమానంగా ట్రీట్ చేస్తున్నాం. పడిపోతే మే ఉన్నాం అన్న ధైర్యం ఇస్తున్నాం. నా కూతురు 9వ తరగతి చదువుతుంది. తను మంచి ఆర్టిస్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఆమె ఇప్పటికే పుస్తకాలు రాసింది, మ్యూజిక్ ను ఇష్టపడుతుంది. నా కూతురు ఎ రంగంలో ఉన్నా సరే మంచి మనిషిగా ఉండాలని కోరుకుంటున్నాను. మహిళలు ఎక్కువ నిబద్ధత, ఎక్కువ ఫోకస్డ్ గా,  బాధ్యతాయుత్తంగా ఉంటారు. మమ్మల్ని తొక్కేస్తున్నారంటూ మహిళల గురించి కేటీఆర్ సరదాగా వ్యాఖ్యానించారు. మేం బయటకి ఎంత నటించినా ఇంట్లో మహిళలే బాస్ లు.. ఎంత పెద్ద నేత అయినా ఇంటికి వెళ్లాకా బాస్ కి భయపడాల్సిందే" అంటూ కేటీఆర్ సమత్కరించారు.