అందుకే కేసీఆర్ బీమా పథకం పెట్టాం : కేటీఆర్

అందుకే కేసీఆర్ బీమా పథకం పెట్టాం : కేటీఆర్

బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కేసీఆర్ బీమా పథకం గురించి మంత్రి కేటీఆర్ వెల్లడించారు.  రైతుబంధు అమల్లోకి వచ్చాక చేనేత,గీత కార్మికుల నుండి ఇలాంటి పథకం తమకు కూడా కావాలన్న డిమాండ్ పెరిగిందని చెప్పారు. దీనిపై సీఎం కేసీఆర్ తో  చర్చించమన్నారు. కులాలు, వృత్తుల వారిగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి స్కీమ్ ఉండాలని కేసీఆర్ బీమా పథకాన్ని తమ మేనిఫెస్టోలో  పెట్టామన్నారు. ఇదోక అద్భుతమైన స్కీమ్ అన్న కేటీఆర్ .. దీనివలన 93 లక్షల కుటుంబాలకు లబ్థి చేకూరుతుందని తెలిపారు.  గతంలో తాము మేనిఫెస్టోలో చెప్పని చాలా హామీలను అమలు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

అంతకుముందు బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించిన సీఎం కేసీఆర్.. రైతుబీమా త‌ర‌హాలోనే కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తామ‌ని  తెలిపారు.  అర్హులైన తెల్లకార్డు క‌లిగిన పేద కుటుంబాల‌కు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఈ ఫథకన్ని క‌ల్పించాల‌ని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.   దీనికి సంబంధించిన బ‌డ్జెట్ లెక్కలు తీయించామని,   బీపీఎల్ కార్డు హోల్డర్స్ అంద‌రికీ ఎల్ఐసీ ద్వారానే చేయించాల‌ని నిర్ణయించుకున్నామని చెప్పారు.   

కేసీఆర్ బీమా ద్వారా ప్రతి కుటుంబానికి రూ. 3600 నుంచి 4 వేల రూపాయాలు ఖ‌ర్చు అయ్యే అవ‌కాశం ఉందని, అయినప్పటికీ  ప్రభుత్వం వెనుకాడ‌టం లేదన్నారు కేసీఆర్.. ఐదు ల‌క్షలు వ‌చ్చే విధంగా ఈ స్కీమ్ కూడా  రైతుబీమా త‌ర‌హాలోనే ఉంటుందన్నారు. నాలుగైదు నెలల్లోనే  ప్రాసెస్ కంప్లీట్ చేసి, జూన్ నుంచి అమ‌లు చేస్తామని కేసీఆర్ చెప్పుకొచ్చారు.