
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆమెతో తమకెలాంటి పంచాయితీ లేదని స్పష్టం చేశారు. గవర్నర్ తనకు తానే ఏదో ఊహించుకుని మాట్లాడితే తామేం చేయాలేమని అన్నారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే విషయంలో తాము ఇబ్బంది పెట్టామనడం సరికాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. నరసింహన్ గవర్నర్గా ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడు ఎదురుకాలేదని చెప్పారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ బడ్జెట్ సెషన్ నిర్వహించడానికి అనేక కారణాలు ఉన్నాయని అన్నారు. గవర్నర్ పదవి చేపట్టక ముందు తమిళిసై ఏ పార్టీ నాయకురాలో అందరికీ తెలుసని అన్నారు కేటీఆర్. రాజకీయ నాయకులుగా ఉన్న మీరు గవర్నర్ కావచ్చు గాని కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ కావద్దా? అని ఆయన ప్రశ్నించారు.