మంత్రి మల్లారెడ్డికి జోష్ ఎక్కువ.. అంటే తప్పేముంది?

మంత్రి మల్లారెడ్డికి జోష్ ఎక్కువ.. అంటే తప్పేముంది?

ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాయన్నారు కేటీఆర్. కాంగ్రెస్ గతిలేక చంద్రబాబు బినామీని పార్టీ అధ్యక్షుడిగా నియమించుకుందన్నారు. రేవంత్ ప్రధాని పదవి వచ్చినట్లుగా ఫీలవుతున్నారని విమర్శించారు కేటీఆర్. ఇకపై చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుందన్నారు కేటీఆర్. ప్రజా సంగ్రామ యాత్ర ఎందుకు చేస్తున్నారో బండి సంజయ్ చెప్పాలన్నారు కేటీఆర్. కేంద్రం అన్ని ఆస్తులను అమ్మేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 11 లక్షల ఉద్యోగాలు  ఉన్నాయని, అందులో ఎస్సీ,ఎస్టీ ఉద్యోగాలకు హామీగా వచ్చిన ఉద్యోగాలు ఉన్నాయన్నారు కేటీఆర్. ప్రస్తుతం కేంద్రంలో 8 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నారు. వాటి గురించి ప్రతిపక్షాలు ఎందుకు ప్రశ్నించవన్నారు. ఇప్పటికే లక్షా 30 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. 

మంత్రి మల్లారెడ్డి కి జోష్ ఎక్కువ ..ఓ మాట అంటే తప్పేముందన్నారు. కాంగ్రెస్ కు దిక్కు లేక చంద్రబాబు ఏజెంట్ ను పీసీసీ చేశారన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాషేంటని ప్రశ్నించార .చంద్రబాబు మాటలు నమ్మి ఓటుకు నోటు దొంగ ను కాంగ్రెస్ నేతలు  పీసీసీ చేశారన్నారు. చెంపమీద కొడతా అంటేనే మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రిని అరెస్ట్ చేసిందని గుర్తు చేశారు. కొందరు జర్నలిస్టు మిత్రులు కూడా జర్నలిజం ముసుగులో కేసీఆర్ ను ఇష్టమోచ్చినట్లు తిడుతున్నారన్నారు..