ఎస్ఆర్డీపీ పనుల్లో వేగం పెంచండి

ఎస్ఆర్డీపీ పనుల్లో వేగం పెంచండి

హైదరాబాద్ నగరం పరిధిలో నాలాల విస్తరణ, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ) పనులపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఎస్ఆర్డీపీ పనుల పురోగతిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతకుముందు నిర్దేశించిన టార్గెట్ ప్రకారం పనుల్లో వేగాన్ని వెంటనే పెంచాలని అధికారులను ఆదేశించారు.

ఎస్ఆర్డీపీ రెండవ దశ పనులకు సంబంధించి పూర్తిస్థాయి డిజైన్లను రూపొందించాలని కేటీఆర్ సూచించారు. ఈసందర్భంగా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపైనా కేటీఆర్ ఆరా తీశారు. హెచ్ఎండీఏ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు ద్వారా నగరంలోని 47 చోట్ల పనులు చేస్తున్నారు. వీటిలో 70 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని కూడా త్వరలోనే పూర్తిచేస్తామని అధికారులు అంటున్నారు.