దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది: కేటీఆర్

దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది: కేటీఆర్
  • పరిశ్రమలకు కేరాఫ్​ అడ్రస్​ తెలంగాణ: కేటీఆర్​

సంగారెడ్డి, వెలుగు: దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని మంత్రి కేటీఆర్​ అన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్ర సంపద పెంచుకుంటూ పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తు న్నామని తెలిపారు. ‘‘రాష్ట్రానికి పన్నులు రావాలి.. నిరుద్యోగులకు కొలువులు కావాలి.. అనే ఉద్దేశంతో ఐదు రకాల విప్లవాత్మక మార్పులతో   రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నం” అని ఆయన చెప్పారు. 

ALSO READ: కేసీఆర్ సర్కార్​ను పాతరేద్దాం:కిషన్రెడ్డి 

బుధవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గుంతపల్లిలో మొనిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసి, మాట్లాడారు. పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్​గా తెలంగాణ మారిందన్నారు. పలు దేశాల నుంచి వేల కోట్లు పెట్టుబడి పెడ్తున్నారని, వారికి సహకరించాలని సూచించారు. ‘‘రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. అవి ఎన్నికలప్పుడు చేసుకోవచ్చు. 

పరిశ్రమలు వచ్చినప్పుడు అందరూ సహకరించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలి. గుంతపల్లిలో పరిశ్రమ ఏర్పాటు వల్ల 500 మందికి ఉపాధి లభిస్తుంది” అని ఆయన అన్నారు. గ్రామీణ అభివృద్ధికి గ్రీన్, ఎల్లో, వైట్, పింక్, బ్లూ విప్లవాలతో ముందుకెళ్తున్నామని చెప్పారు.