TSPSC : ఐటీ మంత్రి పనేంటో తెలుసా..లీకేజీతో నాకేం సంబంధం

TSPSC : ఐటీ మంత్రి పనేంటో  తెలుసా..లీకేజీతో నాకేం సంబంధం

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో తనకేం సంబంధం అని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు మాట్లాడితే ఐటీ మినిస్టర్ను బర్తరఫ్ చేయాలని అంటున్నారని..అసలు ఐటీ డిపార్ట్మెంట్ పని ఏంటో తెలుసా..ఐటీ మినిస్టర్ ఏం చేస్తరో తెలుసా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రతీ కంప్యూటర్ కు తానే బాధ్యున్నా అని అడిగారు. ఐటీ డిపార్ట్ మెంట్ పై అవగాహన లేని వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.  

పిల్లల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టొద్దు..

ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని మంత్రి కేటీఆర్ సూచించారు. అనవసర వ్యాఖ్యానాల వల్ల విద్యార్థుల్లో అనుమానం కల్పించొద్దన్నారు. 2014 ఎన్నికల ముందు ప్రధాని మోడీ ఏడాదికి ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు..ఇంత వరకు ఎన్ని ఇచ్చారని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వని ప్రధాని మోడీ...కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నారని మండిపడ్డారు. 

పెద్ద మనసుతో ఆలోచించాలి..

నాలుగు పరీక్షలను రద్దు చేయడం వల్ల ఈ పరీక్షలకు ఇప్పటికే క్వాలిఫై అయిన విద్యార్థులకు బాధ ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కానీ పెద్ద మనసుతో విద్యార్థులు ఆలోచించాలన్నారు. చాలా మంది విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాయాలా అని బాధపడుతున్నారని..కానీ అనుమానాలు వ్యక్తం అయిన తరుణంలో పరీక్షలు రాయకతప్పదన్నారు.