స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ లో హైదరాబాద్ ఫస్ట్

స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ లో హైదరాబాద్ ఫస్ట్

ప్రతి ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ లో హైదరాబాద్ ముందు నిలుస్తోందన్నారు మంత్రి కేటీఆర్.చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే అతిపెద్ద 20 మెగా వాట్స్ ప్లాంట్లను జవహర్ నగర్ లో ప్రారంభించుకున్నామని.. త్వరలోనే మరో 28 మెగావాట్ల ప్లాంట్ ను ప్రారంభించబోతున్నామని చెప్పారు. హైదరాబాద్ సనత్ నగర్ క్రికెట్ స్టేడియంలో జీహెచ్ఎంసీ స్వచ్ఛ వాహనాలను సోమవారం ఉదయం ప్రారంభించారు. 250 స్వచ్ఛ ఆటోలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గ్రేటర్‌లో ఇంటింటికి తిరిగి చెత్త సేకరణకు స్వచ్చ ఆటోలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే నగరంలో చెత్త సేకరణకు 3,150 స్వచ్ఛ టిప్పర్లు అందుబాటులో ఉండగా… మరో 1100 ఆటోలను జీహెచ్ఎంసీ తీసుకురానుందన్నారు. గతంలో నగరంలో 3,500 మెట్రిల్ టన్నుల చెత్త సేకరించేవారని..ఇప్పుడు 6,500 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారని చెప్పారు.

శానిటేషన్ సిబ్బందికి నగరవాసుల తరపున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి కేటీఆర్.