ఏరోస్పేస్​సెక్టార్​లో పెట్టుబడులకు తెలంగాణ  బెస్ట్

ఏరోస్పేస్​సెక్టార్​లో పెట్టుబడులకు తెలంగాణ  బెస్ట్

ఏరోస్పేస్​సెక్టార్​లో పెట్టుబడులకు తెలంగాణ  బెస్ట్
అమెరికా ఇన్వెస్టర్లతో మంత్రి కేటీఆర్

హైదరాబాద్, వెలుగు : ఏరోస్పేస్​డిఫెన్స్​సెక్టార్​లో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమని మంత్రి కేటీఆర్​ అన్నారు. శుక్రవారం ఆయన అమెరికాలో జరిగిన ఇన్వెస్టర్ల రౌండ్​టేబుల్ ​సమావేశంలో మాట్లాడారు. 9 ఏండ్లల్లో  ఏరోస్పేస్​ రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందని మంత్రి అన్నారు. 2018, 2020 సంవత్సరాల్లో ఏరోస్పేస్​పెట్టుబడులకు సంబంధించి ఉత్తమ అవార్డులు కూడా అందుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఏరోస్పేస్​ డిఫెన్స్​ కంపెనీలను కేటీఆర్ కోరారు. అనంతరం వాషింగ్టన్​ డీసీలో ప్రముఖ ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​సంస్థ జాప్​కాం ఫౌండర్ సీఈవో కిశోర్​పల్లంరెడ్డితో  కేటీఆర్​సమావేశమయ్యారు.

హైదరాబాద్​లో  ఎక్సలెన్స్ సెంటర్​ఏర్పాటుపై చర్చించారు. కరీంనగర్​లో మెడికల్​కోడింగ్​ సెంటర్​ఏర్పాటుకు ఎక్లాట్​హెల్త్​కేర్​ కంపెనీ ముందుకు వచ్చింది. తమ సంస్థ కోడింగ్​సెంటర్​తో మొదట వంద మందికి ఉద్యోగాలిస్తామని, తర్వాత ఆ సంఖ్యను 200కి  పెంచుతామని సంస్థ సీఈవో కార్తీక్​ పొలసాని వివరించారు. మంత్రితో సమావేశమైన వారిలో సంస్థ ప్రతినిధులు సందీప్​ వాద్వా తదితరులు ఉన్నారు. జీనోం వ్యాలీలో జెనేసిస్​ బయో టెక్నాలజీ సంస్థ రూ.60 మిలియన్​ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. కేటీఆర్​తో ఆ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు.

ఇప్పటికే జీనోమ్ ​వ్యాలీలోని తమ కంపెనీలో 250 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, కొత్త పెట్టుబడితో ఇంకో 300 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు. అనంతరం వాషింగ్టన్​ డీసీలో 30కిపైగా ఐటీ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్​ భేటీ అయ్యారు. హైదరాబాద్​లోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాలకు ఐటీ ఇండస్ట్రీని విస్తరిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్​లో ఐటీ టవర్లను ప్రారంభించామని తెలిపారు. త్వరలోనే సిద్దిపేట, నిజామాబాద్, నల్గొండలో ఐటీ టవర్ల నిర్మాణం పూర్తి కాబోతుందని వెల్లడించారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రం, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలోని ఐటీ కంపెనీలను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆయా నగరాలు, పట్టణాల్లో తమ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సమావేశాల్లో టెక్నోజెన్​ ఇంక్​ సీఈవో లక్స్​చేపూరి, బీఆర్ఎస్ ​ఎన్ఆర్ఐ అధ్యక్షుడు మహేశ్​బిగాల, వంశీరెడ్డి, కార్తీక్, జయేశ్​రంజన్, విష్ణువర్ధన్​రెడ్డి, అమర్​నాథ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.