
వానాకాలం పంటను ప్రభుత్వమే పూర్తిగా కొంటుందన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన.. జిల్లాలో ఇప్పటికే 52 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని.. ఇంకా 3 లక్షల టన్నుల పంట కొనవలసి వస్తుందని తెలిపారు. తడిసిన ధాన్యం కూడా కొనే ప్రయత్నం చేయాలని అధికారులకు తెలిపామన్నారు. రాష్ట్రంలో 4,743 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి, నీటీ వసతులకు కేంద్రం ఎలాంటి సహాయాన్ని అందించలేదని..యాసంగి ధాన్యం కొనమనే అనేదాన్ని కేంద్రం పునసమీక్షించుకోవాలన్నారు.రేపు(గురువారం) రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయనున్నట్లు తెలిపారు. కేంద్రానికి తెలంగాణ ధనం కావాలి కానీ, ధాన్యం వద్దు అనే కేంద్ర విదానాన్ని వ్యతిరేఖిస్తున్నామన్నారు.
అంతకు ముందు..మానేరు నదిలో చెక్‌డ్యామ్‌లో ఈతకు వెళ్లి మృతి చెందిన ఆరుగురు విద్యార్థుల కుటుంబాలను కేటీఆర్ పరామర్శించారు. వారి కుటుంబాలను కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక్కో విద్యార్థి కుటుంబానికి రూ.5లక్షల చెక్కులను అందజేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. దుర్ఘటన జరిగిన ప్రమాదంలో హెచ్చరిక బోర్డులు పెట్టడంతో పాటు గస్తీ ఏర్పాటు చేయాలని సూచించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి కేటీఆర్.