ప్రధాని మోడీని విమర్శిస్తూ కేటీఆర్ ట్వీట్

ప్రధాని మోడీని విమర్శిస్తూ కేటీఆర్ ట్వీట్

మంత్రి కేటీఆర్ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై సటైర్ వేశారు. యూకే పీఎం లిజ్ ట్రస్ రాజీనామాను ప్రస్తావిస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఎకనామిక్ పాలసీ విషయంలో ఫెయిలైనందుకు ట్రస్ 45 రోజుల్లోనే పదవి నుంచి తప్పుకున్నారని, ప్రధాని మోడీ చాలా విషయాల్లో విఫలమైనప్పటికీ ఇంకా పదవిలోనే కొనసాగుతున్నారంటూ చురకలంటించారు.

ఎకనామిక్ పాలసీ విషయంలో విఫలమైన యూకే ప్రధాని లిజ్ ట్రస్ 45రోజుల్లోనే రాజీనామా చేసిన వార్త చదివి ఆశ్చర్యపోయాను. కానీ మన దేశంలో మన ప్రధాని గత 30 ఏండ్లలోనే అత్యధిక నిరుద్యోగిత, 45 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం, ప్రపంచంలోనే అత్యధిక ఎల్పీజీ రేట్లు, డాలర్తో పోలిస్తే భారీగా పతనమవుతున్న రూపాయిని ఇచ్చారని ట్వీట్ చేశారు. ఇన్ని అంశాల్లో విఫలమైనా మోడీ ఇంకా ప్రధాని పదవిలో కొనసాగుతున్నారంటూ పరోక్షంగా విమర్శించారు.