రైతులు అనుకున్నది సాధించారు

రైతులు అనుకున్నది సాధించారు

రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోడీ నిర్ణయంతో ప్రజల శక్తి చాలా గొప్పదని మరోసారి నిరూపితమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతులు తమ ఆందోళనలతో అనుకున్నది సాధించారని ఆయన అన్నారు.

‘అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎల్లప్పుడూ గొప్పది. తమ అలుపెరగని ఆందోళనలతో కోరుకున్నది సాధించామని భారత రైతులు మరోసారి నిరూపించారు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.