
తెలంగాణకు కేంద్రం నుంచి సరైన సహకారం అందట్లేదన్నారు ఐటీ మినిస్టర్ కేటీఆర్. సోమాజీగూడ ఐటీసీ కాకతీయలో నిర్వహించిన సీఐఐ వార్షిక సదస్సులో కేటీఆర్ మాట్లాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో తెలంగాణ టాప్-5లో ఉంటూ వస్తోందన్నారు. అన్ని రంగాలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. అగ్రికల్చర్ తర్వాత నిర్మాణ రంగంలోనే అధిక మంది ఉపాధి పొందుతున్నారని చెప్పారు. అగ్రికల్చర్ సెక్టార్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ద్వితీయ స్థాయి నగరాలకు ఐటీని విస్తరిస్తున్నామన్నారు కేటీఆర్.విభజన హామీలను కేంద్రం మరిచిపోయిందన్నారు.