కాకతీయ విగ్రహాలను కాపాడుకుంటాం

కాకతీయ విగ్రహాలను కాపాడుకుంటాం

700 ఏళ్ల చరిత్ర ఉన్న కాకతీయుల ఉత్సవాలను రాష్ట్రంలో నిర్వహిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో 'కాకతీయ వైభవం' 777 ఫొటోస్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. దీన్ని కాకతీయ వంశీయుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలు వారం రోజుల పాటు జరుగుతాయన్నారు. ఈ కాకతీయుల వైభవం, చరిత్ర నేటి యువతకు వివరిస్తామన్నాని కేటీఆర్ తెలిపారు. టార్చ్ అనే సంస్థ ఈ కాకతీయ ఉత్సవాల చరిత్రను తెలియజేస్తున్నారు. రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ సంపదగా ఎంపిక కావడం మనకు గర్వ కారణం అన్నారు. కాకతీయ వరహాలు, తృణమూలు, అనేక చరిత్ర అవశేషాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. శిల్పాలను చూస్తే కాకతీయుల చరిత్ర గుర్తు వస్తుందన్నారు. కాకతీయ చరిత్ర చూస్తే ఆనందంతో పాటు భాద వేస్తుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఆలయాలు, శిలలు కూలిపోయాయి. మైనింగ్ వల్ల కొన్ని విగ్రహాలకు కనుమరుగు అవుతున్నాయన్నారు. రాష్ట్రంలో కాకతీయ విగ్రహాలు కాపాడుకుంటామని కేటీఆర్ అన్నారు. కాకతీయ చరిత్ర నేటి యువతకు తెలియజేయాలని కేటీఆర్ సూచించారు. వేరే దేశాల్లో వారసత్వ సంపదను కాపడుకుంటారని కేటీఆర్ గుర్తు చేశారు. 

కాకతీయ వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ మాట్లాడుతూ.. అరవింద్ టార్చ్ సంస్థ తో కాకతీయ చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చారన్నారు. కాకతీయ చరిత్రను ప్రపంచానికి తెలియజేస్తామన్నారు. బస్తర్ లో దేవాలయాలు కట్టించామని చంద్ర భంజ్ దేవ్ తెలిపారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నామని ఆయన వెల్లడించారు.   

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కాకతీయ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. చెరువులను అభివృద్ధి చేసిన ఘనత కాకతీయులదని తలసాని అన్నారు. కాకతీయులు ఉన్న చోట టెంపుల్స్ ,ట్యాంక్స్ ,ఉంటాయని మంత్రి తలసాని కొనియాడారు.