
సీఎస్ఆర్ నిధులతో హైదరాబాద్ లో చెరువుల అభివృద్ది చేపట్టనున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటికే దుర్గం చెరువు టూరిస్ట్ స్పాట్ గా మారిందని అన్నారు. మరో 50 చెరువుల అభివృద్దికి కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం జరిగిందని స్పష్టం చేశారు కేటీఆర్. నగరంలో చెరువుల బ్యూటిఫికేషన్,వాటి సంరక్షణ కోసం పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు.
ఇందులో భాగంగా మార్చి 28వ తేదీన మంగళవారం 50 చెరువులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డెవెలప్ చేస్తామని ముందుకు వచ్చిన కొన్ని సంస్థలతో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఒప్పందం చేసుకుంది. ఒప్పంద పత్రాలను ఆ సంస్థలకు మంత్రి కేటీఆర్ అందజేశారు. అనంతరం ఖాజాగూడ పెద్ద చెరువు అభివృద్ది పనులు ప్రాంభంచారు కేటీఆర్. ఈ అభివృద్ది పనులు సామాజిక బాధ్యతతో చేయడమే తప్ప.. ఇందులో ఏలాంటి రాజకీయాలు లేవని కేటీఆర్ తెలిపారు.