బన్సీలాల్పేట మెట్ల బావి సందర్శనను ప్రారంభించిన కేటీఆర్

బన్సీలాల్పేట మెట్ల బావి సందర్శనను ప్రారంభించిన కేటీఆర్

సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలోని మెట్ల బావిని పునరుద్ధరించడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో మెట్ల బావి సందర్శనను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మెట్ల బావి శుభ్రం చెయ్యడానికి పని చేసిన సిబ్బందిని ఆయన అభినందించి.. సర్టిఫికెట్లు అందించారు. గత 13 నెలలుగా శ్రమించి ఈ మెట్ల బావిని బాగు చేశారని..అన్ని శాఖల సమన్వయంతో ఈ అద్భుతం సాధ్యమైందన్నారు.

నగరంలో మరో 43 పాత బావులు ఉన్నాయని..వాటిని కుడా పునరుద్దరించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మెట్లబావి నుంచి 3900 మెట్రిక్ టన్నుల చెత్త బయటికి తీశామన్నారు. 863 ట్రిప్ లు ద్వారా  చెత్తను తరలించామని తెలిపారు. 10 కోట్ల రూపాయలు దీనికి ఖర్చైందన్నారు. హైదరాబాద్ కు యునెస్కో గుర్తింపు తీసుకొస్తమని తెలిపారు. పురాతన ఆస్తులను పునరుద్దరించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నామన్నట్లు తెలిపారు. స్టానికులు ఈ మెట్ల బావిని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. 

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

మెట్ల బావిని ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దిందని, స్థానికులు అందరూ దాన్ని కాపాడుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. రాబోయే రోజుల్లో మెట్ల బావి అంతర్జాతీయ టూరిజం స్పాట్ గా మారుతుందని తెలిపారు. అన్ని రంగాల్లో హైదరాబాద్ ను డెవలప్ చేస్తున్నాం..కేటీఆర్ నాయకత్వంలో అన్ని విధాలుగా డెవలప్మెంట్ జరుగుతున్నాయని అన్నారు. స్టెప్ వల్ ను పునరుద్దరణ అవ్వడంతో గ్రౌండ్ వాటర్ పెరుగుతుందన్నారు. పొద్దున లేస్తె కార్మికులకు దండలు పెట్టాలి అని ముఖ్య మంత్రి చెప్తారు..కార్మికుల వల్లె ఈ మెట్ల బావి అద్భుతంగా తయ్యరైందని మంత్రి తలసాని వ్యాఖ్యనించారు.