చెట్లు పెంచకుంటే ఆక్సీజన్‌‌ను కొనుక్కునే రోజులొస్తాయ్

చెట్లు పెంచకుంటే ఆక్సీజన్‌‌ను కొనుక్కునే రోజులొస్తాయ్

హైదరాబాద్: మొక్కలు, చెట్ల పెంపకం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందనని మంత్రి హరీశ్ రావ్ అన్నారు. నెక్లెస్ రోడ్‌‌లోని పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్ నర్సరీ మేళాను హరీశ్ ప్రారంభించారు. వివిధ జాతులు, విదేశాలకు సంబంధించిన హార్టికల్చర్, అగ్రికల్చర్ మొక్కల స్టాళ్లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మొక్కల పెంపకం గురించి హరీశ్ మాట్లాడారు.

‘ఈ మెగా హార్టికల్చర్‌‌లో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 120 స్టాళ్లు పెట్టారు. హైదరాబాద్‌‌ ప్రజలు ఇక్కడ దొరికే మొక్కలను కొనుక్కొని ఇళ్లల్లో పెంచాలి. చెట్ల పెంపకంతో మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు. మొక్కలు, చెట్ల పెంపకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో పెద్ద ఎత్తున నర్సరీలను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు మంచి నీళ్లు కూడా కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. గాలి అనేది చాలా అవసరం. అందుకే ప్రతి ఇంటి దగ్గర మొక్కలు, చెట్లు పెంచాలి లేకపోతే రాబోయే రోజుల్లో ఆక్సీజన్ కూడా కొనుక్కునే పరిస్థితి రావొచ్చు. పిల్లలకు రాబోయే రోజుల్లో మంచి పర్యావరణాన్ని అందించాలి’ అని హరీశ్ రావ్ పేర్కొన్నారు.