జగిత్యాల జిల్లాలో కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

జగిత్యాల జిల్లాలో కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

నేడు జగిత్యాలలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. రూ.322.90 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఉదయం 8:50 గంటలకు మంత్రి కేటీఆర్.. సీఎం  క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరి 9 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరకుంటారు. అక్కడ్నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం హెలిపాడ్ వద్దకు 9:45 నిమిషాలకు చేరకుంటారు. ఉదయం 10 గంటలకు మొదట జిల్లా కేంద్రంలో నూతనంగా రూ.38 కోట్లతో  నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

నూకపల్లిలో రూ.280 కోట్ల తో నిరుపేదల కోసం నిర్మించిన 4వేల 520 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మొదటి విడతలో భాగంగా మంత్రి కేటీఆర్.. 3వేల 722 ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేస్తారు. అనంతరం బీట్ బజార్ లో నూతనంగా రూ.4కోట్ల 50 లక్షల తో నిర్మించిన వెజ్& నాన్ వెజ్ మార్కెట్ ను ప్రారంభిస్తారు. 11:30 ప్రాంతంలో జిల్లా కేంద్రంలో ని మినీ స్టేడియంలో ప్రజలను ఉద్దేశించి ఆయన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత తిరిగి హెలికాప్టర్ ద్వారా ధర్మపురికి  బయలుదేరుతారు.