ప్రజా జీవితంలోకి వ‌చ్చి ఈ సెప్టెంబ‌ర్‌తో 16 ఏళ్లు

ప్రజా జీవితంలోకి వ‌చ్చి ఈ సెప్టెంబ‌ర్‌తో 16 ఏళ్లు

తాను ప్రజా జీవితంలోకి వ‌చ్చి ఈ సెప్టెంబ‌ర్‌తో 16 ఏళ్లు పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఉద్యమంలో 8  ఏళ్లు, మంత్రిగా  8  ఏళ్లు పనిచేశానని పేర్కొన్నారు. ఈ 16 ఏళ్లలో తనకు మద్ధతిచ్చిన తెలంగాణ ప్రజలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యమంలో పాల్గొన్న కొన్ని ఫోటోలను మంత్రి షేర్ చేశారు.  మంత్రికి అభిమానులు, పార్టీ కార్యకర్తలు అభినందనలు తెలుపుతున్నారు. 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీచేసి గెలిచిన కేటీఆర్... ఆ తరువాత కూడా అక్కడినుండే పోటీచేస్తూ వరుసగా గెలుస్తూ వస్తున్నారు.