‘నేతన్నకు చేయూత’ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

‘నేతన్నకు చేయూత’ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్: చేనేత పరిశ్రమకి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి, ఆర్థికాభివృద్ధి కల్పించడం కోసం కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. నెక్లెస్ రోడ్‌లోని పీపుల్ ప్లాజా‌లో జరిగిన నేషనల్ హాండ్లూమ్ డే సెలెబ్రేషన్స్‌లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ నిర్వహించి, చేనేత వస్ర్తాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ ప్రత్యేకమైన నైపుణ్యాన్ని దేశ ప్రజలకు తెలియజేసేందుకు ఈకామర్స్ ద్వారా ఈగోల్కొండ పోర్టల్‌ను రూపొందించుకున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలోని చేనేత అభివృద్ధి మరియు చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంది. మన పథకాలపై అధ్యయనం చేయడానికి ఒడిషా, కర్ణాటక మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల బృందాలు మన రాష్ట్రాన్ని సందర్శించి అభినందించడం జరిగింది. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల లబ్ధికి ‘నేతన్నకు చేయూత’ పథకాన్ని మంత్రి కేటీఆర్ పున: ప్రారంభించారు.

https://twitter.com/MinisterKTR/status/1423927457149718537