రేవంత్ ప్రశ్నిస్తుంటే నవ్వొస్తున్నది : KTR

రేవంత్ ప్రశ్నిస్తుంటే నవ్వొస్తున్నది : KTR
  • మూడు ఫీట్లున్నోళ్లు విమర్శిస్తే జనం ఊరుకోరు: కేటీఆర్
  • ఎమ్మెల్యేకు డబ్బులిచ్చి దొరికిన దొంగ 
  • రేవంత్ ప్రశ్నిస్తుంటే నవ్వొస్తున్నది
  • నాగర్ కర్నూల్ సభలో నడ్డా అడ్డమైన మాటలు మాట్లాడి పోయిండు
  • కేసీఆర్‌‌‌‌ను ఎందుకు జైలుకు పంపుతారో చెప్పాలని ప్రశ్న
  • ఉప్పల్ రింగ్ రోడ్‌‌లో స్కైవాక్ ప్రారంభం

ఉప్పల్, వెలుగు:  ఈ 23 ఏండ్లలో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌తో పెట్టుకున్నోళ్లెవరూ బాగుపడలేదని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. భూమికి జానెడు, మూడు ఫీట్లున్న వాళ్లు విమర్శలు చేస్తే జనం ఊరుకోరని మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌‌‌‌ నాగోల్‌‌‌‌లో రూ.10 కోట్లతో నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌‌‌‌ను కేటీఆర్ ప్రారంభించారు. తర్వాత ఉప్పల్ రింగ్ రోడ్‌‌‌‌లో నిర్మించిన స్కై వాక్‌‌‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప్పల్‌‌‌‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. నాగర్ కర్నూల్ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి సైతం ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ పై ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. 

‘‘జేపీ నడ్డా ఆదివారం నాగర్ కర్నూల్ లో జరిగిన సభలో అడ్డమైన మాటలు మాట్లాడి పోయిండు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను ఎందుకు జైలుకు పంపుతారో ఆయన చెప్పాలి” అని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు డబ్బులు పంచి దొరికిన దొంగ రేవంత్​రెడ్డి కూడా ప్రశ్నిస్తే నవ్వొస్తున్నదని ఎద్దేవా చేశారు. ఈ రెండు, మూడు ఫీట్లున్న వాళ్లతో ఒరిగేదేమీ లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు ఎవరు ఏం చేయాలన్నా ఢిల్లీ పోవాలని, కానీ ఇక్కడ కేసీఆర్ పాలనతో తెలంగాణ దూసుకుపోతున్నదని చెప్పారు.

జనాభాకు అనుగుణంగా స్కై వాక్‌‌‌‌ల నిర్మాణం

హైదరాబాద్‌‌‌‌లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా స్కై వాక్‌‌‌‌ల నిర్మాణం చేపడుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఉప్పల్ చౌరస్తా వద్ద నాగోల్, వరంగల్, హబ్సిగూడ వైపు నుంచి వచ్చే వెహికల్స్ కారణంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటున్నదని, దీంతో పాదచారు లు రోడ్డు దాటేందుకు ఇబ్బందిపడుతున్నారని చెప్పా రు. స్కై వాక్ నిర్మాణం వల్ల పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు వీలుంటుందని వివరించారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేకంగా లిఫ్ట్ సౌకర్యం, ఎక్సలేటర్‌‌‌‌‌‌‌‌తో 6 ఎంట్రీలు, 6 ఎగ్జిట్లతో హెచ్ఎండీఏ నిర్మించిందన్నారు. 

హైదరాబాద్​లో పెరుగుతున్న కాలనీలు, అపార్ట్ మెంట్లకు అనుగుణంగా  తాగునీటి వసతి కల్పిస్తామన్నారు. 70 కి.మీ. మేర ఉన్న మెట్రో రైలు మార్గాన్ని శంషాబాద్ వరకు మరో 31 కిలోమీ టర్ల మేర రెండున్నరేండ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. నారపల్లి నుంచి ఉప్పల్ వరకు నిర్మించే ఫ్లై ఓవర్ కోసం జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం రూ.350 కోట్లతో భూసేకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఉప్పల్–- అంబర్ పేట ఫ్లైఓవర్ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు.

ALSO READ:హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.300 కోట్లతో షాపింగ్ మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..రూ.200 కోట్లతో మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాసెసింగ్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

భారీగా ట్రాఫిక్ జామ్

స్కైవాక్ ఓపెనింగ్​కు మంత్రి కేటీఆర్ రావడంతో స్థానిక బీఆర్ఎస్ లీడర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ వాహనాలను రోడ్ల పక్కనే నిలాపరు. దీంతో ఉప్పల్ రింగ్ రోడ్డులో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నాగోల్, తార్నాక, రామంతాపూర్ వైపు కొన్ని కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి..

‘కేటీఆర్ గో బ్యాక్’ అంటూ బీజేపీ నిరసన

స్కైవాక్ ఓపెనింగ్​కు హాజరైన కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు నిరసన సెగ తగిలింది. గతంలో ఉప్పల్ అభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీజేపీ నేతలు కేటీఆర్ కాన్వాయ్​ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఉప్పల్ రింగ్ రోడ్​లో నిరసన చేపట్టి ‘కేటీఆర్ డౌన్ డౌన్’​.. ‘కేటీఆర్ గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించిన వారిని పక్కకు లాగేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. మంత్రి రాకముందే పోలీసులు బీజేపీ నేతలను మేడిపల్లి పోలీసుస్టేషన్​కు తరలించారు. గతంలో ఇచ్చిన హామీలను కేటీఆర్ నెరవేర్చలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. కానీ స్కైవాక్ ప్రారంభోత్సవానికి ఎలా వస్తారని ప్రశ్నించారు.