మంత్రి కేటీఆర్ సిరిసిల్ల టూర్ షెడ్యూల్

మంత్రి కేటీఆర్ సిరిసిల్ల టూర్ షెడ్యూల్

మంత్రి కేటీఆర్ ఏప్రిల్ 12న సిరిసిల్లలో పర్యటించనున్నారు.  ఉదయం 10 గంటలకు తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామంలో కోల్డ్ స్టోరేజ్ సెంటర్ ను ప్రారంభిస్తారు. ఉదయం 10.15 గంటలకు తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన వ్యవసాయ కళాశాలను ప్రారంభిస్తారు.  మధ్యాహ్నం 1.30 గంటలకు జిల్లెల్లలో  అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.  మధ్యాహ్నం 2 గంటల నుంచి ముస్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో  మంత్రి కేటీఆర్ గారు పాల్గొంటారు. కేటీఆర్ వెంట స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి,  మంత్రి నిరంజన్ రెడ్డి, ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్ కలిసి పాల్గొంటారు.

బీజేపీ నేతలకు  విశాఖ ఉక్కుపై ఉన్న శ్రద్ద బయ్యారం స్టీల్ ప్లాంట్ పై ఎందుకు లేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.  ప్రధాని మోడీ, అదానీ తెలుగు రాష్ట్రాల పొట్టగొడుతున్నారని విమర్శించారు.