
హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్ లేబరేటరీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్… కేంద్రాన్ని కోరారు. కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి హర్షవర్ధన్ కి కేటీఆర్ లెటర్ రాశారు. జీనోమ్ వ్యాలీ లో గవర్నమెంట్ మెడికల్ స్టోర్ డిపో ఏర్పాటు చేయాలని కోరారు.
జీనోమ్ వ్యాలీ ప్రపంచ వ్యాక్సిన్ తయారీకి రాజధానిగా ఉందన్నారు. 60 బిలియన్ డోసులను ఇక్కడి కంపెనీలు తయారు చేస్తున్నాయన్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్నందునే ప్రధానితో సహా 85 దేశాలకు చెందిన రాయబారులు జీనోమ్ వ్యాలీలో పర్యటించారని కేటీఆర్ లో లెటర్ లో కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. భారతదేశ వ్యాక్సిన్ తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా.. కేంద్రం వెంటనే ఈ రెండు నిర్ణయాలు తీసుకోవాలని లేఖలో కోరారు కేటీఆర్.