ప్రజలపై పైసా భారం పడకుండా లక్ష్మి బ్యారేజ్ మరమ్మత్తు చేస్తం : కేటీఆర్

ప్రజలపై పైసా భారం పడకుండా లక్ష్మి బ్యారేజ్ మరమ్మత్తు చేస్తం :  కేటీఆర్

కాళేశ్వరం  ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదన్నారు మంత్రి కేటీఆర్.  ప్రాజెక్టులు కట్టాక చిన్న చిన్న లోపాలు జరుగుతాయని చెప్పారు.  అది కేవలం ఒక్క ప్రాజెక్ట్ కాదన్న మంత్రి..  అందులో 3 బ్యారేజ్ లు ఉన్నాయని తెలిపారు.  కాళేశ్వరం  ప్రాజెక్టు 45లక్షల ఎకరాలకు రెండు పంటల నీళ్ళు అందిస్తుందన్నారు.    ప్రజల పై ఒక్క పైసా భారం పడకుండా లక్ష్మి బ్యారేజ్ మరమ్మత్తు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.  తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై మంత్రి కేటీఆర్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.  

తెలంగాణలో కేజీ టూ పీజీ విద్యను అందిస్తామన్నారు మంత్రి కేటీఆర్.  పలకతో రండి పట్టా పోండి.. ఇది మా విద్యా విధానమని చెప్పారు.  ధరణి తీసేస్తామని ప్రతిపక్షాలు చెప్తున్నాయని,  ధరణి పోతే మళ్ళీ దళారీ వ్యవస్థ వచ్చినట్లేనని అన్నారు. దీనిని ప్రజలు గమనించాలని కేటీఆర్ చెప్పుకొచ్చారు.   తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌ వన్‌ ఉందన్నారు కేటీఆర్.  జీఎస్డీపీలో అత్యంత వేగంగా పెరుగుతున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు.  మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి కోసం రూ.37 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.  ప్రాజెక్టుల కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.