గతంలో ఏ ప్రభుత్వాలు బతుకమ్మ చీరలు పంపిణీ చేయలేదు

గతంలో ఏ ప్రభుత్వాలు బతుకమ్మ చీరలు పంపిణీ చేయలేదు

కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తున్నార‌ని అన్నారు మంత్రి మల్లారెడ్డి. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా బతుకమ్మ పండగకు చీరలు పంపిణీ చేయలేద‌ని, గత నాలుగు సంవత్సరాల నుంచి సీఎం కేసీఆర్ బ‌తుకమ్మ, దసరా పండుగ కానుకగా బతుకమ్మ చీరలను అందజేయడం జరుగుతంద‌ని అన్నారు. న‌గ‌రంలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ లో బ‌తుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి మల్లారెడ్డి, మేయర్ మేకల కావ్య.

ఈ సంద‌ర్భంగా మ‌ల్లారెడ్డి మాట్లాడుతూ.. పేదింటి ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అన్నగా, ఒక కొడుకుగా, ఒక బిడ్డగా.. బతుకమ్మ సందర్భంగా చీరలు అందిస్తున్నారన్నారు. బతుకమ్మ పండుగను గ్రామ గ్రామాలలోని మ‌హిళ‌లు తంగేడు పువ్వులు అలంకరించుకొని బతుకమ్మ ఆటపాటలతో సంబరాలు జరుపుకుంటార‌ని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు సీఎం కేసీఆర్.. కల్యాణ లక్ష్మి. షాదీ ముబారక్ , కేసీఆర్ కిట్టు, మహిళా గురుకుల పాఠశాలలు , రైతులకు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను ప్రవేశపెట్టార‌ని కొనియాడారు