
రాష్ట్రంలో కరోనా మహమ్మారి ని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తన వంతు సాయంగా కోటి రూపాయలను అందజేశారు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. సిఎం సహాయనిధికి 1కోటి రూపాయల చెక్కును మరియు సి.ఎం.ఆర్ ఇన్‌స్టిట్యూషన్ తరుపున 25 లక్షల చెక్కులను టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కి అందచేశారు. మంత్రి మల్లారెడ్డితో మర్రి రాజశేఖర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డి, డాక్టర్ భద్రరెడ్డి పాల్గొన్నారు.