బీజేపీ నేతలను తెలంగాణలో తిరుగనియ్యం: మంత్రి మల్లారెడ్డి

బీజేపీ నేతలను తెలంగాణలో తిరుగనియ్యం: మంత్రి మల్లారెడ్డి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. పలు చోట్ల బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లరెడ్డి తప్పుబట్టారు. 2023, మార్చి 11న మేడ్చల్ జిల్లా కీసర గ్రామంలో ఏర్పాటు చేసిన మహిళ దినోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన ఆయన స్పందించించారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ నాయకులు తీరు మార్చుకోకుంటే తెలంగాణలో తిరగనియమని హెచ్చరించారు. బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి మల్లారెడ్డి. మరోవైపు కవిత లిక్కర్ కేసులో ఈడీ విచారణపై బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.