డ్యాన్స్ చేసి పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన మల్లారెడ్డి

డ్యాన్స్ చేసి పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన మల్లారెడ్డి

మునుగోడు నియోజకవర్గంలో నేడు టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ సందర్భంగా  రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి క్యాంపు కార్యాలయం నుండి ఉప్పల్ వరకు పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్ర రెడ్డి కూడా పాల్గొన్నారు. పార్టీ జెండాలు చేతబూని, నినాదాలు చేస్తూ నిర్వహిస్తూ టీఆర్ఎస్ నాయకులు కదలివచ్చారు. ఇక ఈ ర్యాలీ భాగంగా మల్లారెడ్డి పాటలకు తగ్గ స్టెప్పులు వేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. పార్టీ జెండాను పట్టుకొని నేతలతో కలిసి డ్యాన్స్ చేశారు. 

ఇక నేడు మునుగోడులో జరగనున్న సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. దారి పొడవునా పార్టీ కార్యకర్తలు కేసీఆర్ కటౌట్లు పెట్టించారు. చౌటుప్పల్ మండలం నుంచి నారాయణపురం వరకు రోడ్డుకు ఇరువైపులా భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌‌లు ఏర్పాటు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని సభలోనే సీఎం ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుండటంతో.. ఈ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.