
రాష్ట్రంలో పలువురు రాజకీయ నాయకులు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజా ప్రతినిధులు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా మరో మంత్రి మల్లా రెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు. గత ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో మల్లా రెడ్డికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఆయనతో పాటు ఆయన భార్యకు కూడా కరోనా సోకింది. దీంతో ఆయన ఫ్యామిలీ ఒకరోజు కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొంది ఆ తర్వాత సెల్ఫ్ ఐసోలేషన్ ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అలాగే మల్లా రెడ్డి కుటుంబసభ్యులకు, ఆయనకు సన్నిహితంగా ఉన్న వారికి కూడా అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు. కాగా ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో సహా ఆయన భార్య, కుమారులకు కూడా కోవిడ్ సోకింది.