ఐటీ విచారణకు హాజరుకానున్న మల్లారెడ్డి కుటుంబసభ్యులు

ఐటీ విచారణకు హాజరుకానున్న మల్లారెడ్డి కుటుంబసభ్యులు

ఐటీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ్టి విచారణకు తమ కుటుంబసభ్యులు హాజరవుతున్నట్లు చెప్పారు. అయితే తన తరుపున ఆడిటర్ విచారణకు హాజరవుతారని మల్లారెడ్డి చెప్పారు. తాను ఉప్పల్లో జరిగే  పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున ఐటీ విచారణకు వెళ్లలేకపోతున్నాని అన్నారు.  

ఐటీ నోటీసులు అందుకున్న మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి విచారణకు హాజరవుతానని చెప్పారు. అధికారులు ఇచ్చిన నోటీసుల్లో హాజరవ్వాలని మాత్రమే ఉందని..ఎటువంటి డాక్యుమెంట్స్, బ్యాంక్ లావాదేవీలు తీసుకొని రావాలని సూచించలేదన్నారు. తన ఇంట్లో దొరికిన లిక్విడ్ క్యాష్ గురించి ఐటీ అధికారులకు పూర్తి వివరాలు తెలియజేస్తానని స్పష్టం చేశారు. 

గతవారం మంత్రి మల్లారెడ్డి ఇండ్లు, ఆఫీసులు, కాలేజీలతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఐటీ అధికారులు రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. భారీగా నగదుతో పాటు కొన్ని కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నవంబర్ 28న విచారణకు హాజరుకావాలని మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, ఉద్యోగులు సహా 16 మందికి నోటీసులు ఇచ్చారు.