హరిత హారంతో కాలుష్యం తగ్గుముఖం

హరిత హారంతో కాలుష్యం తగ్గుముఖం

మేడ్చల్ జిల్లా: హరిత హారం కార్యక్రమంతో కాలుష్యం తగ్గుముఖం పడుతోందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 8 వ విడత హరితహారం కార్యక్రమం లో భాగంగా శాంతి వనంలో  మంత్రి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి, సీడీఎంఏ డైరెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి  మాట్లాడుతూ... హరిత హారంతో అడవుల విస్తీర్ణం పెరిగి... ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఎనిమిదో విడత హరితహర కార్యక్రమంలో భాగంగా పీర్జాదిగూడలోని శాంతి వనంలో 12 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక అయిన హరితహారం కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. ప్రతి ఇంటిలో ఆరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. శాంతివనంలో చిల్డ్రన్ పార్క్, వయోవృద్ధుల కొరకు ప్రత్యేకమైన ఏర్పాటు, బీచ్ వాలీబాల్, వనభోజనాలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న  డిప్యూటీ మేయర్ శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.