కందిపప్పు గురించి పాఠాల్లో పెట్టాలి: నిరంజన్ రెడ్డి

కందిపప్పు గురించి పాఠాల్లో పెట్టాలి: నిరంజన్ రెడ్డి

తెలంగాణకు ఖ్యాతిని పెంచిన తాండూరు కందిపప్పుకు గుర్తింపు రావడం గొప్ప విషయమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కందిపప్పు సాగు, ప్రాముఖ్యత గురించి పాఠ్యాంశాలలో చేర్చాలని ఆయన చెప్పారు. కందికి భౌగోళిక గుర్తింపు రావడం అనేది భూమిని నమ్ముకున్న రైతుల విజయమని నిరంజన్ రెడ్డి కొనియాడారు. ఆహార పంటల కంటే ఉద్యానవన నూనెగింజలు, పప్పు దినుసుల పంటలు ఎక్కువగా సాగు చేయాలని రైతులకు సూచించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా త్వరలోనే జిల్లా రైతులకు సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తాండూర్ పట్టణంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు భౌగోళిక గుర్తింపు పత్రాన్ని అందజేశారు. 

తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఆరు అంశాలలో ప్రత్యేక గుర్తింపు వచ్చిందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆహార ఉత్పత్తులు కాని, ప్రత్యేక కళలు కాని వాటిని గుర్తించి జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ టాగింగ్ చేస్తామన్నారు. భౌగోళిక గుర్తింపు ఉన్నవాటికి జియో టాకింగ్ చేయడం వల్ల ఆ వస్తువుల వినియోగం దేశవ్యాప్తంగా మరింత పెరుగుతుందని ఆయన చెప్పారు.