సమస్యల పరిష్కారం కోసమే పల్లెనిద్ర

సమస్యల పరిష్కారం కోసమే పల్లెనిద్ర
  • గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మార్చినం
  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. శుక్రవారం రాత్రి వనపర్తి మండలం చీమనగుంటపల్లిలో పల్లెనిద్ర చేసి శనివారం ఉదయం గ్రామంలో పర్యటించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మౌలిక  సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తుండడంతో ఎనిమిదేండ్లలో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయన్నారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో సౌకర్యాలు మెరుగయ్యాయన్నారు. వనపర్తి చుట్టూ ఉన్న చెరువుల పునరుద్ధరణతో ప్రజలకు ఆహ్లాదంతో పాటు పట్టణంలోని బోరుబావుల్లో పుష్కలంగా నీళ్లు ఉంటున్నాయన్నారు.  ఒకప్పుడు మురికినీటితో దుర్భరంగా ఉండే నల్లచెరువు, తాళ్లచెరువు, అమ్మచెరువులను మినీ ట్యాంక్ బండ్‌‌‌‌లుగా డెవలప్‌‌‌‌ చేసి..  కృష్ణా నీటితో నింపుతున్నామని చెప్పారు. 

రోడ్ల  విస్తరణ పూర్తయితే వనపర్తి మోడల్ పట్టణంగా మారుతుందని చెప్పారు.  అనంతరం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో 70 మందికి  రూ.20.64 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అంతకుముందు నల్లచెరువుపై రూ.1.15 కోట్లు, వశ్యా తండాలో రూ.84 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లు, మెట్ పల్లిలో రూ.45 లక్షలతో నిర్మించే సీసీ డ్రెయిన్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అలాగే రాజనగరం అమ్మచెరువు పనులను పరిశీలించడంతో పాటు  తన క్యాంప్ ఆఫీస్‌‌‌‌లో మైనార్టీ గురుకుల అడ్మిషన్ల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. 

ఈ  కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్ గౌడ్,  డీఎండబ్ల్యూవో కాళిక్రాంతి, ఆర్ఎల్‌‌సీ హవీలారాణి, ప్రిన్సిపాల్స్ జనార్దన్ గౌడ్, సౌమ్యలు,  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు  పాల్గొన్నారు

అనాథల బాధ్యత తీసుకోవాలి

అనాథ పిల్లల సంక్షేమం, సంరక్షణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని ఎమ్మార్పీఎస్‌‌‌‌ నేతలు కోరారు. శనివారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు అనాథలను ఆదుకోవాలని ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందు అనాథ పిల్లల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. విద్య, ఉద్యోగం, ఉపాధి, సంక్షేమం, సంరక్షణతో పాటుగా అనాథ పిల్లల గుర్తింపుకు స్మార్ట్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో అనాథ గురుకులాలు ఏర్పాటు చేయాలని, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్,  రాజానగరం రాజేశ్, నాయకులు గంధం లక్ష్మయ్య,  బైరపోగు శివ, సిరివాటి శ్రీనివాస్, గంధం గట్టయ్య, మంద నరసింహ, కొమ్ము చెన్నకేశవులు, గట్టు స్వామి  పాల్గొన్నారు.