కోహెడలో అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్

కోహెడలో అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్

రైతు వేదికలు కర్షక దేవాలయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సంగారెడ్డిలో జిల్లాస్థాయి వానకాలం పంటల సాగు సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో వ్యవసాయమే ప్రధాన ఉపాధి అని..వ్యవసాయం బాగుంటే వంద రకాల ఉపాధులు పొందవచ్చని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా రైతులు భిన్నమైన పంటల సాగు చేయడనికి ముందు ఉంటారని మంత్రి తెలిపారు. ప్రస్తుత తెలంగాణ పరిస్థితులు విభిన్న పంటల సాగుకు అనువుగా ఉందని..వానాకాలంలో రెండు లక్షల ఎకరాలలో ఆలు సాగు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

అన్ని వసతులతో కోహెడలో అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం జరుగుతుందని నిరంజన్ రెడ్డి చెప్పారు. వివిధ రకాల ఆహార శుద్ది పరిశ్రమలను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. రైతు వేదికలలో పంటల ప్రణాళిక అమలు గురించి రైతులకు వివరించాలని అధికారులకు సూచించారు. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసేవిధంగా రైతులు ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వం వ్యవసాయం కోసం 3.75 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. 

వ్యవసాయంలో వరికంటే అన్ని పంటలు లాభసాటిగా ఉన్నాయన్నారు. ఆముదం పంటకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దమ్ముంటే దేశవ్యాప్తంగా రైతు బంధు అమలు చేస్తామని ప్రకటించాలని నిరంజన్ రెడ్డి సవాల్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏంచేయకుండా తెలంగాణ రాష్ట్రంపై అనవసర నిందలు వేస్తున్నారని విమర్శించారు. దేశంలోని రైతులు బాగుపడాలంటే కనీస మద్దతు ధర చట్టం చేయాలని మంత్రి తెలిపారు. మరో మూడు , నాలుగేళ్లలో తెలంగాణ వ్యవసాయం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం

కేసీఆర్ ఇలాఖాలో సర్పంచుల నిరసన

బీజేపీ, కాంగ్రెస్లు అధికారంలోకి వస్తే మళ్లీ చీకటి రోజులు