
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రమంత్రి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. పంజాబ్ లో వరిధాన్యం కొంటునట్లు తెలంగాణలోనూ కొనాలని డిమాండ్ చేశారు. మంగళవారం MCRHRDలో రైతులతో మంత్రులు సమావేశమయ్యారు. తెలంగాణ రైతులు పండించిన యాసంగి వడ్లు కొనాలని చేపట్టే నిరసనలపై చర్చించారు. మరోవైపు సాయంత్రం 4 గంటలకు హస్తినకు వెళ్లనున్న మంత్రులు.. కేంద్ర మంత్రులను కలిసి యాసంగి వడ్ల కొనుగోళ్లపై ఒత్తిడి తేనున్నారు.